కేజీఎఫ్ ఫ్రాంచైజీతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కన్నడ సూపర్ స్టార్ యష్, దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ యాక్షన్ డ్రామాలో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి టాప్ హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అయితే, ఈ సినిమా పాత్రలపై హీరో యాష్ తాజాగా ఒక సంచలన విషయాన్ని లీక్ చేశాడు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార పాత్రలు నెగెటివ్ షేడ్స్ తో సరికొత్తగా ఉంటాయని ఆయన హింట్ ఇచ్చాడు. బ్యాడ్యాస్ ఉమెన్ క్యారెక్టర్లలో వారు కనిపిస్తారని, స్క్రీన్‌పై వారి పాత్రలు ప్రేక్షకులకు ఒక సరికొత్త రిఫ్రెషింగ్ ఫీలింగ్‌ను ఇస్తాయని యాష్ చెప్పుకొచ్చాడు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో యాష్ త్వరలోనే దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రమోషన్స్ ప్రారంభించనున్నాడు.
