‘టాక్సిక్’ మొదటి వారం వసూళ్లు ఎంతంటే!

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా కీయారా అద్వానీ, రుక్మిణి వసంత్, తార సుతారియా అలాగే నయనతార తదితర స్టార్ తారాగణంతో తెరకెక్కించిన లేటెస్ట్ భారీ సినిమానే టాక్సిక్. ఎన్నో అంచనాలు భారీ బుకింగ్స్ నడుమ విడుదలకి వచ్చిన ఈ సినిమా ఊహించని ఫలితాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది.

అయితే మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత రోజు నుంచే డీలా పడిపోయింది. ఇలా అక్కడ నుంచి మరో 150 కోట్ల గ్రాస్ అందుకోడానికి ఈ ఆరు రోజుల సమయాన్ని తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మొత్తం వారం రన్ పూర్తి చేసుకునేసరికి టాక్సిక్ 310 కోట్లకి పైగా గ్రాస్ ని ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్టు కన్నడ సినీ వర్గాలు పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో దాదాపు సగం వసూళ్లు హిందీ మార్కెట్ నుంచే నమోదు కావడం విశేషం. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి. ఈ సినిమాకి రవి బసృర్ సంగీతం అందించారు అలాగే యశ్, కే వెంకట నారాయణ నిర్మాణం వహించారు.

Exit mobile version