టాక్సిక్ ట్రోలింగ్స్ : యష్‌కు ఇంకా ఆ హ్యాంగోవర్‌లోనే ఉన్నాడా..?

Toxic-Movie

కన్నడ సినిమాను పాన్-ఇండియా స్థాయిలో నిలబెట్టిన ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజ్ తర్వాత, రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన భారీ చిత్రం ‘టాక్సిక్’. కేజీఎఫ్ 2 తర్వాత దాదాపు 50కి పైగా కథలను తిరస్కరించిన యష్, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌పై కొండంత నమ్మకంతో ముందుకు వెళ్లాడు.

అయితే, నాలుగేళ్ల ఎదురుచూపుల తర్వాత ఈ సినిమా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, రిజల్ట్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా మిగిలిపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో యష్ నటన, ఆయన లుక్స్ మరియు బాడీ లాంగ్వేజ్ పై తెగ ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ‘కేజీఎఫ్’లో రాకీ భాయ్ క్యారెక్టర్ హ్యాంగోవర్ నుంచి యష్ ఇంకా బయటకు రాలేకపోయాడని, అదే మేనరిజమ్స్‌ను ఇందులోనూ గుడ్డిగా రీపీట్ చేశారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

కథ కొత్తగా ఉన్నప్పటికీ రాకీ భాయ్ నీడ స్పష్టంగా కనిపిస్తోందని ప్రేక్షకులు భావిస్తున్నారు. కేజీఎఫ్ లాంటి ల్యాండ్‌మార్క్ సినిమాలు ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తాయని, యష్ ఇకనైనా ఆ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి సరికొత్త పాత్రలపై దృష్టి పెట్టాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version