“కేజీఎఫ్2” కోసం డైలాగ్స్ రాసిన యష్

Published on Mar 30, 2022 11:55 am IST

థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన తర్వాత చాప్టర్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను దర్శకుడు వెల్లడించాడు.

కేజీఎఫ్ 2 ట్రైలర్ చూసిన చాలా మందికి యష్ చెప్పిన వయోలెన్స్ డైలాగ్ బాగా నచ్చింది. ఇప్పుడు ఆ డైలాగ్‌ని యష్ స్వయంగా రాశాడని ప్రశాంత్ నీల్ వెల్లడించాడు. ఈ సినిమాలో తన పాత్ర కోసం యష్ చాలా డైలాగ్స్ రాశాడని దర్శకుడు పేర్కొన్నాడు. హోంబలే ఫిలింస్ ఈ పాన్ ఇండియన్ సినిమాను భారీ స్థాయిలో నిర్మించింది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది, ఇందులో సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ మరియు ఇతరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఏప్రిల్ 14, 2022న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :