“యశోద” పై మరిన్ని ఆసక్తికర అంశాలు రివీల్ చేసిన దర్శకులు.!

“యశోద” పై మరిన్ని ఆసక్తికర అంశాలు రివీల్ చేసిన దర్శకులు.!

Published on Nov 10, 2022 10:09 PM IST

మన సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంతా మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ చిత్రం “యశోద”. ఒక యూనిక్ కాన్సెప్ట్ తో దర్శకులు హరి, హరీష్ లు తెరకెక్కించిన ఈ చిత్రం రేపు గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రానికి గాను సమంత అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టుగా టీజర్, ట్రైలర్ లు చూస్తేనే అర్ధం అవుతుంది.

కానీ సమంతా తనకి ఫిజికల్ కండిషన్ బాగోకపోయినా కూడా ఈ చిత్రాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని పూర్తి చేసారని దర్శకులు లేటెస్ట్ గా చెబుతున్నారు. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు చెప్తూ అసలు యశోద స్టోరీ ని సమంత గారినే మైండ్ లో పెట్టుకొని సిద్ధం చేశామని రివీల్ చేశారు.

అలాగే సరోగసి అనే కాన్సెప్ట్ జస్ట్ ఇందులో థ్రిల్ అంశమే కానీ ఎమోషన్స్ ఈ చిత్రంలో ఇంకా బాగుంటాయని వారు రివీల్ చేశారు. అంతే కాకుండా సినిమాలో టోటల్ గా 30 నుంచి 40 సెట్టింగ్స్ ని వేశామని ఈ చిత్రంపై మరిన్ని ఆసక్తికర అంశాలు లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. మరి రేపు థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు