యూఎస్ లో హాఫ్ మిలియన్ కి చేరువలో “యశోద”.!

యూఎస్ లో హాఫ్ మిలియన్ కి చేరువలో “యశోద”.!

Published on Nov 15, 2022 9:00 AM IST

స్టార్ హీరోయిన్ సమంతా మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ సాలిడ్ థ్రిల్లర్ చిత్రం “యశోద” దర్శకుడు హరి అండ్ హరీష్ లు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకోవడమే కాకుండా సమంత కెరీర్ లో అదిరే ఓపెనింగ్స్ ని ఈ చిత్రం అందుకుంది. ఇక ఈ చిత్రం ఒక్క తెలుగు స్టేట్స్ లోనే కాకుండా యూఎస్ లో కూడా మంచి వసూళ్లు నమోదు చేస్తూ స్ట్రాంగ్ రన్ ని అయితే కొనసాగిస్తోంది.

మరి ఈ చిత్రం లేటెస్ట్ గా యూఎస్ లో 4 లక్షల 50 వేల డాలర్స్ మార్క్ ని అయితే టచ్ చేసింది. దీనితో ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్క్ కి అతి చేరువలో ఉందని చెప్పాలి. మరి దానిని అయితే ఈ చిత్రం ఈరోజుతో టచ్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి అయితే మణిశర్మ సంగీతం అందించగా శ్రీదేవి మూవీస్ వారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు