ప్రేక్షకులకు చెప్పాల్సిన కథ ‘యశోద’ – పాయింట్ విన్నాక ఎగ్జైట్ అయ్యి సినిమా చేశాం – కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ

ప్రేక్షకులకు చెప్పాల్సిన కథ ‘యశోద’ – పాయింట్ విన్నాక ఎగ్జైట్ అయ్యి సినిమా చేశాం – కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ

Published on Nov 13, 2022 2:11 AM IST


సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా సినిమా యశోద రెండు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకి వచ్చి ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే. హరి, హరీష్ తెరకెక్కించిన ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఈ మూవీ ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ ఎంతో భారీ వ్యయంతో పాన్ ఇండియన్ మూవీ గా నిర్మించారు. ఇక ప్రస్తుతం రిలీజ్ అయిన అన్ని భాషల్లో యశోద మంచి స్పందనతో కలెక్షన్స్ తో కొనసాగుతుండడంతో మూవీలో కీలక పాత్రలు చేసిన కల్పిక గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ ప్రత్యేకంగా మీడియాతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ముందుగా కల్పికా గణేష్ మాట్లాడుతూ, ఇంట్లో కూర్చుకుని ఫిలాసఫీ చెపితే ఎవరూ వినరని, అయితే దానిని అందరినీ ఆకట్టుకునేలా ఎంగేజింగ్ గా చెప్తే తప్పకుండా ఆడియన్స్ కి రీచ్ అవుతుందని, ఆ విధంగా దర్శకులు మూవీని అలరించేలా తెరకెక్కించి మంచి పేరు దక్కించుకున్నారు అని అన్నారు.

ప్రస్తుతం తనతో పాటు ఈ మూవీలో పాత్రలు చేసిన దివ్య, ప్రియాంక ఇలా అందరం కెరీర్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ యశోద స్టోరీ నచ్చడంతో మా పాత్ర చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా చేసాం అని అన్నారు. ముఖ్యంగా ఈ సమాజంలో ఏమి జరుగుతుంది అనేది ఆడవారికి మాత్రమే కాదు పిల్లలకు అలానే మగవారికి కూడా అర్ధం కావాలనే ఉద్దేశ్యంతోనే తామందరం మూవీ కోసం ఎంతో కష్టపడ్డాం అన్నారు. ఇక మెయిన్ రోల్ చేసిన సమంత కష్టం గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే అన్నారు. తాను గతంలో చేసిన ప్రయాణం మూవీ క్యారెక్టర్ కి ఈ క్యారెక్టర్ మరొక వర్షన్ అని, ఫైనల్ గా ఆడియన్స్ నుండి వస్తున్న ఆదరణకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు కల్పికా గణేష్. ఇక దివ్య శ్రీపాద మాట్లాడుతూ, యశోద లో పాత్రల పేర్లకు శ్రీకృష్ణుడితో కనెక్టివిటీ ఉంటుందని అన్నారు. సర్రోగసి కాన్సెప్ట్ కొథ్ది కాదని చెప్పడానికే బహుశా అటువంటి పేర్లు పెట్టరేమో అనిపించింది. ఇక మూవీ కోసం అందరం ఎంతో కష్టపడ్డాం అన్నారు. ముఖ్యంగా సిలికాన్ బెల్లితో చేయడం కష్టం అయినప్పటికీ కథ ఎగ్జైటింగ్ గా అనిపించడంతో ఇష్టం తో చేసాం అని చెప్పారు. లీలకు కృష్ణ అంటే ఎంత ప్రేమ అనేది చాలా వివరించారు. లీల ఎంత ఇన్నోసెంట్ అనేది నేను ఫీల్ అయ్యానో అలా ప్రేక్షకుడు కూడా ఫీల్ అవ్వాలి. సమంత ఇంకా భవిష్యత్తులో చాలా చేయగలరు.

సమంత మాత్రమే కాదు, ఈ సినిమా చూశాక మిగతా ఫిమేల్ ఆర్టిస్టులకు ఇటువంటి సినిమా చేసే ఛాన్సులు వస్తాయని, ఇటువంటి కథలు రాస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈ యశోద కథకు వస్తే సినిమా ఎండ్ కార్డ్స్‌లో న్యూస్ క్లిప్పింగ్స్ చూపిస్తారు, అదే సినిమాకు మూలం అని అన్నారు దివ్యశ్రీపాద. అనంతరం ప్రియాంక శర్మ మాట్లాడుతూ, నిజానికి ఇటువంటి కథలు అరుదు గా వస్తాయని యశోద లాంటి కథల్లో నటించే అవకాశం మిస్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతోనే కొంత తీసుకున్నప్పటికీ ఫైనల్ గా ఓకె చెప్పానని అన్నారు. ఇక ఈ మూవీలో ప్రెగ్నెంట్ గా నటించడానికి సిలికాన్ బెల్లితో నటించడం జరిగిందని, అది అంత ఈజీ కానప్పటికీ మూవీ స్టోరీ ఎంతో బాగుండడంతో కష్టాన్ని కూడా ఇష్టంగా చేసుకుని అందరం నటించడం జరిగిందని చెప్పారు. ఫైనల్ గా అవుట్ ఫుట్ ఆడియన్స్ కి నచ్చడం, మూవీ అందరి మెప్పు అందుకుని ముందుకి నడుస్తుండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక సమంత విషయానికి వస్తే, బాడీ డూప్ ఉపయోగించే అవకాశం ఉన్నా చాలా సన్నివేశాలు ఆమె స్వయంగా చేశారు. నిజంగా ఆమె డెడికేషన్‌కి హార్డ్ వర్క్ కి హ్యాట్సాఫ్ అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు