నైజాంలో రెండో రోజు రైజ్ అయ్యిన “యశోద” వసూళ్లు.!

నైజాంలో రెండో రోజు రైజ్ అయ్యిన “యశోద” వసూళ్లు.!

Published on Nov 13, 2022 11:00 AM IST

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ సాలిడ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం “యశోద”. దర్శకులు హరి అండ్ హరీష్ లు తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోగా వసూళ్ల పరంగా కూడా సామ్ మళ్ళీ తన సత్తా చాటింది. ఇక లేటెస్ట్ గా అయితే ఈ సినిమా అనుకున్నట్టే మొదటి రోజు కన్నా రెండో రోజు మరింత మెరుగైన వసూళ్లు ఈ చిత్రం రాబట్టింది.

లేటెస్ట్ గా నైజాంలో రెండో రోజు మొదటి రోజు కన్నా ఎక్కువ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. మరి మొదటి రోజు నైజాం లో యశోద 1.23 కోట్ల నెట్ వసూళ్లు అందుకోగా రెండో రోజు అయితే ఈ చిత్రం 1.6 కోట్లు రాబట్టడం విశేషం దీనితో ఈ చిత్రానికి రెండు రోజుల్లో 2.83 కోట్ల నెట్ వసూళ్లు నమోదు అయ్యాయి. దీనితో డెఫినెట్ గా ఈ ఆదివారం కూడా సాలిడ్ వసూళ్లు ఈ చిత్రానికి నమోదు అవుతాయని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా శ్రీదేవి మూవీస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు