యూఎస్ లో సూపర్ స్ట్రాంగ్ గా “యశోద” సెన్సేషన్.!

యూఎస్ లో సూపర్ స్ట్రాంగ్ గా “యశోద” సెన్సేషన్.!

Published on Nov 13, 2022 12:00 PM IST

సమంత ప్రభు మెయిన్ లీడ్ లో నటిస్తున్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో ఒకటైన చిత్రం “యశోద” ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కాగా ఈ చిత్రం సూపర్ పాజిటివ్ సాలిడ్ ఓపెనింగ్స్ ని ఈ చిత్రం అందుకోగా రెండో రోజు మరింత స్థాయిలో నమోదు చేసింది. ఇక ఈ చిత్రం తెలుగు స్టేట్స్ వసూళ్లు పక్కన పెడితే యూఎస్ లో ఈ చిత్రం సూపర్ స్ట్రాంగ్ గా దూసుకెళ్తుంది.

మరి మొదటి రోజుకే 2 లక్షల డాలర్స్ కి పైగా వసూళ్లు ఈ చిత్రం నమోదు చేయగా ఇప్పుడు రెండు రోజుల్లో అయితే 3 లక్షల డాలర్స్ కి పైగా వసూళ్లు కొల్లగొట్టి టోటల్ గా 3 లక్షల 50 వేల డాలర్స్ గ్రాస్ మార్క్ కి చేరుకొని సెన్సేషన్ ని నమోదు చేసుకుంది. ఇక ఈ ఆదివారంతో అయితే ఈ స్పీడ్ లో హాఫ్ మిలియన్ మార్క్ ని యశోద టచ్ చేసినా ఆశ్చర్య పడక్కర్లేదు. ఇక ఈ చిత్రం అయితే హరి అండ్ హరీష్ లు దర్శకత్వం వహించగా వరలక్ష్మి శరత్ కుమార్ అలాగే తదితరులు కీలక పాత్రల్లో నటించగా శ్రీదేవి మూవీస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు