హాఫ్ మిలియన్ మార్క్ కి చేరుకున్న “యశోద”.!

హాఫ్ మిలియన్ మార్క్ కి చేరుకున్న “యశోద”.!

Published on Nov 16, 2022 10:00 AM IST

స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ సాలిడ్ థ్రిల్లర్ చిత్రం “యశోద”. దర్శకులు హరి అండ్ హరీష్ లు తెరకెక్కించిన ఈ లేటెస్ట్ చిత్రం సాలిడ్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఓవరాల్ వరల్డ్ వైడ్ అదరగొట్టి సమంత స్టామినా చూపించింది. అలాగే యూఎస్ లో కూడా గట్టి ఓపెనింగ్స్ నే రాబట్టి అదరగొట్టింది.

ఇక లేటెస్ట్ గా అయితే అనుకున్నట్టుగానే ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 5 లక్షల డాలర్స్ మార్క్ ని చేరుకొని హాఫ్ మిలియన్ క్లబ్ లో అయితే ఎంటర్ అయ్యింది. ప్రస్తుతానికి ఇంకా మంచి రన్ లోనే కొనసాగుతున్న ఈ చిత్రం మరింత మంచి నంబర్స్ యూఎస్ లో నమోదు చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి అయితే మణిశర్మ సంగీతం అందించగా శ్రీదేవి మూవీస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు