కన్నుమూసిన ఒకప్పటి స్టార్ నటి !

ఒకప్పటి స్టార్ హీరోయిన్, నటిగా గొప్ప గుర్తింపు పొందిన ‘కృష్ణ కుమారి’ ఈరోజు ఉదయం కన్నుమూశారు. 85 ఏళ్ల వయసుగల ఆమె వృద్దాప్య సంబంధిత సమస్యల వలన మరణించారు. 1933లో జన్మించిన ఆమె 1960, 70ల కాలంలో స్టార్ నటీమణిగా వెలుగొందారు. ఆ తరం స్టార్ హీరోలైన ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, శివాజీ గణేశన్ వంటి వారితో ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు.

‘నవ్వితే నవరత్నాలు’ చిత్రంతో సినీ రంగంలోకి ప్రవేశించిన ఆమె ‘బంగారు పాప, పెళ్లి కానుక, భార్య భర్తలు, కులగోత్రాలు, ఉమ్మడి కుటుంబం, గుడిగంటలు’ వంటి చిత్రాల్లో నటించారు. తెలుగు, కన్నడ, తమిలలో కలిపి సుమారు 160 కి పైగా చిత్రాల్లో నటించారామె. ఆమె ఆకస్మిక మరణం తెలుగు పరిశ్రమకు నిజంగా పూడ్చలేని వెలితే అనాలి.  123తెలుగు టీమ్ ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతోంది.