హిందీ, తెలుగు భాషల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగి చిరంజీవి సరసన ‘ఇంద్ర, శంకర్ దాదా ఎం.బి.బిఎస్’ వంటి చిత్రాల్లో నటించిన సోనాలి బెంద్రే కాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ లో చిన్నగా నొప్పి కలిగితే డాక్టర్ దగ్గరకు వెళ్లి టెస్ట్ చేయించుకున్నానని, అది హై గ్రేడ్ కాన్సర్ అని తేలిందని, దీనికి వెంటనే చికిత్స అవసరమైనందున డాక్టర్ల సలహా మేరకు న్యూయార్క్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాని, ప్రతి దశలోనూ ఈ కాన్సర్ తో పోరాడతానని, తనపై ఇంత ప్రేమ, జాగ్రత్త చూపిస్తున్న అందరికీ కృతజ్ఞతలని అన్నారు. అలాగే యుద్ధం మొదలైంది.. నా వెనుక నా కుటుంబ సభ్యులు, స్నేహితుల సపోర్ట్ ఉంది అంటూ భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు.
— Sonali Bendre Behl (@iamsonalibendre) July 4, 2018
