నటి, యాంకర్ మల్లిక మృతి !

ప్రముఖ టీవీ యాంకర్, నటి మల్లిక కన్నుమూశారు. కేవలం 39 ఏళ్ల వారు మాత్రమే ఉన్న మల్లికా గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ, కోమాలో ఉండి ఈరోజు సోమవారం బెంగుళూరులో తుది శ్వాస విడిచారు. అభినయ అనేది ఆమె అసలు పేరు. తొలితరం టీవీ యాంకర్లలో మల్లికది చెరిగిపోని స్థానం.

యాంకర్ గా మంచి ఉన్నతిని చూసిన ఆమె ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి వెంకటేష్ నటించిన ‘కలిసుందాం రా’, మహేష్ బాబు పూర్తిస్థాయి హీరోగా చేసిన తొలి చిత్రం ‘రాజకుమారుడు’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇవాళ ఆమె భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమె మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పలువురు సినీ, టీవీ ప్రముఖులు ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.