తెలుగులోకి డబ్ కానున్నదుల్కర్-నిత్యామీనన్ ల మరో చిత్రం

6th, October 2016 - 08:39:51 AM

saaman-nitya
దుల్కర్ సలీమాన్, నిత్యామీనన్ల కాంబినేషన్ అంటే మలయాళంలోనే కాక తెలుగులో సైతం మంచి క్రేజ్ ఉంది. గతంలో విడుదలైన ‘ఓకే బంగారం, 100% లవ్’ వంటి చిత్రాలు ఇక్కడ మంచి విజయాల్ని సాధించాయి కూడ. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన మరో మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్’ తెలుగులోకి డబ్ కానుంది.

ప్రముఖ నిర్మాత, పలు తమిళ, మలయాళ చీరాలను తెలుగు ప్రేక్షకులకందించిన సురేష్ కొండేటి ఈ చిత్రం యొక్క తెలుగు డబ్బింగ్ హక్కులను దక్కించుకున్నారు. దర్శకుడు అన్వర్ రషీద్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మలయాళంలో 2012 లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి మూడు జాతీయ అవార్డులు కూడా లభించాయి. ఈ చిత్రాన్ని త్వరలో ‘జతగా’ పేరుతో విడుదలచేయనున్నారు నిర్మాత సురేష్.