
యంగ్ హీరో నిఖిల్ అన్నగానే సినీ ప్రేక్షకులకు గుర్తొచ్చేది ఒకటే.. అతను డిఫరెంట్ కాన్సెప్ట్ లతో తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలు చేస్తాడు. ఇలా అనుకోవడానికి కారణం నిఖిల్ చేసిన గత మూడు సినిమాల కథలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండడం, అలాగే మూడు బాక్స్ ఆఫీసు వద్ద హిట్స్ గా నిలవడం. అదే తరహాలోనే క్రైమ్ కామెడీ జానర్లో నిఖిల్ చేసిన మరో డిఫరెంట్ ఫిల్మ్ ‘శంకరాభరణం’. ఈ సినిమా డిసెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమా తర్వాత కూడా డిఫరెంట్ సినిమాలను చేయడానికే నిఖిల్ ఇష్టం చూపుతున్నాడు.
ఇప్పటికే టైగర్ ఫేం విఐ ఆనంద్ డైరెక్షన్ లో ఫాంటసీ థ్రిల్లర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిపాము. తాజాగా నిఖిల్ మరో డిఫరెంట్ జానర్ ఫిల్మ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొత్త డైరెక్టర్ కార్తీక్ రెడ్డి చెప్పిన ఓ స్పోర్ట్స్ డ్రామాకి ఓకే చెప్పాడు. తెలుగులో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చాలా అంటే చాలా తక్కువ వస్తాయి. అందుకే కార్తీక్ రెడ్డి చెప్పిన స్టొరీ బాగా నచ్చడంతో నిఖిల్ వెంటనే ఓకే చెప్పేసాడు. 2016 ఫిబ్రవరిలో ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం నిఖిల్ శంకరాభరణం ప్రీ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు. నందిత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి కథ – కథనం – డైలాగ్స్ – నిర్మాత – దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతల్ని కోన వెంకట్ చూసుకున్నారు.