‘మెగాస్టార్ చిరంజీవి’ 150వ సినిమా టైటిల్ అదేనా ?

chiru-
‘మెగాస్టార్ చిరంజీవి’ చేస్తున్న 150వ చిత్రంపై ప్రస్తుతం ఓ హాట్ టాపిక్ నడుస్తోంది. తమిళ ‘కత్తి’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మొదట ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్ ను అనుకున్నట్టు వార్తలొచ్చినా ఆ వార్తల్ని ‘రామ్ చరణ్’ కొట్టి పారేయడంతో ప్రస్తుతం మరో పేరు బయటకొచ్చింది. అదే ‘నెపోలియన్’. దీనికి ట్యాగ్ లైన్ గా ‘పోరాటం అతని నైజం’ అని కూడా పెట్టారు. ఎక్కడ చూసినా ఇక ఇదే ఫైనల్ అని వినిపిస్తోంది.

పైగా చిరంజీవి ప్రొడక్షన్ కంపెనీ అయిన ‘కొణిదల ప్రొడక్షన్స్’ పేరుతో ఓ పోస్టర్ సైతం విడుదలై నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే ‘నెపోలియన్’ అన్న టైటిల్ ఆ కథకి చాలా బాగా యాప్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా మొత్తం నడిచేది రైతుల కోసం జరిగే పోరాటం మీదనే కాబట్టి. అంతేగాక చాలా ఏళ్ళ తరువాత రీఎంట్రీ ఇస్తున్న చిరంజీవికి మాస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే కాబట్టి ఈ టైటిల్ వాళ్లకు కూడా బాగా నచ్చే ఛాన్సుంది. కానీ ఈ విషయంపై మెగా క్యాంపు ఓ క్లారిటీ ఇస్తే గాని పూర్తిగా నమ్మడానికి లేదు. ఇకపోతే ‘వినాయక్’ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ‘రామ్ చరణే’ స్వయంగా నిర్మిస్తున్నాడు.