యు ఆర్ మై హీరో చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

Published on Dec 10, 2021 6:00 pm IST

ఫిరోజ్ ఖాన్‌, సనా ఖాన్‌, సంహిత విన్య (నూతన పరిచయం) ఐశ్వర్య, మిలింద్ గునాజీ, మేకా రామకృష్ణ, అనంత్ నటీనటులుగా, ప్రతాని రామకృష్ణ గౌడ్ సమర్పణలో, మౌంట్ ఎవరెస్ట్ పతాకంపై, షేర్ దర్శకత్వంలో మిన్ని నిర్మిస్తున్న చిత్రం “యు ఆర్ మై హీరో”.

వైజాగ్ దగ్గర నర్సీ పట్నం లోని కౌన్సిలర్ ల చేతులమీదుగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు, ఈ సందర్భంగా
‘యు ఆర్ మై హీరో’ చిత్ర నిర్మాత మిన్ని మాట్లాడుతూ .. మా చిత్రాన్ని గోవాలో మండ్రమ్, సోలిమ్, అంబోలి వంటి మంచి మంచి లొకేషన్స్ లలో షూటింగ్ చేయ్యడం జరిగింది.. అలాగే హైదరాబాదులోని అల్యూ మినియం ఫ్యాక్టరీ లో కూడా షూట్ చేశాము. ఇందులో మూడు పాటలు మూడు ఫైట్లు ఉంటాయి. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకు అద్భుతమైన ఔట్ ఫుట్ వచ్చింది. హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ రొమాంటిక్ ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా మూవీ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వ బోతున్నాము. ఫ్యామిలీ అందరూ కలసి చూసే విధంగా తీసిన ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ప్రేక్షకు లందరూ మా “యు ఆర్ మై హీరో ” చిత్రాన్ని ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

సంబంధిత సమాచారం :