ఇండియన్ ఓటీటీ హిస్టరీలో సెన్సేషన్ సెట్ చేసిన పాపులర్ ఓటీటీ సిరీస్ లలో బాలీవుడ్ హిట్ సిరీస్ మీర్జాపూర్ కూడా ఒకటి. పాన్ ఇండియా లెవెల్లో ఈ సిరీస్ కోసం తెలియని వారు దాదాపు ఉండకపోవచ్చు. ఇక ఈ క్రేజ్ తోనే మేకర్స్ ఈసారి మీర్జాపూర్ సినిమానే దింపుతున్నారు.
హిందీ మార్కెట్ తర్వాత తెలుగు లోనే ఎక్కువ టార్గెట్ చేస్తూ ఈ సెప్టెంబర్ 4న విడుదల చేస్తున్న ఈ సినిమా థియేటర్లులో చూడడానికి ముందు ఏమన్నా చూడాలా అంటే ఈ సినిమా ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ట్విస్ట్ ఇచ్చారు. థియేటర్స్ లో సినిమా చూడ్డానికి ముందు మీర్జాపూర్ సీజన్ 1 ని చూడమని రికమెండ్ చేస్తున్నారు.
సో ఈ సిరీస్ సీజన్ 1 తో సినిమా లింక్ అయ్యి ఉందని చెప్పొచ్చు. మళ్లీ ఒకసారి సీజన్ 1 ను తిరగేస్తే సినిమా కూడా డీటైలింగ్ గా అర్ధం అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో థియేట్రికల్ గా ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ సినిమాకి గురుమీత్ సింగ్ దర్శకత్వం వహించగా దివ్యెందు శర్మ, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించారు.
