యువ నటుడు “క్రిష్ సిద్దిపల్లి” బర్త్ డే స్పెషల్ ఇంటర్వ్యూ.!

యువ నటుడు “క్రిష్ సిద్దిపల్లి” బర్త్ డే స్పెషల్ ఇంటర్వ్యూ.!

Published on Feb 4, 2023 7:49 AM IST

టాలీవుడ్ లో గత 8 సంవత్సరాలుగా డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ లలో వర్క్ చేస్తూ ఆర్జీవీ దగ్గర దర్శకత్వంలో మెలుకువలు నేర్చుకొని అడవి శేష్ హీరో గా నటించిన “క్షణం” సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా,గూఢచారి, టైగర్ నాగేశ్వరావు వంటి సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా,నేను లేని నా ప్రేమకథ” , సినిమాలలో లీడ్ రోల్ లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు క్రిష్ సిద్ది పల్లి మూడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లలో నటిస్తున్నాడు. ఈ నెల 3న క్రిష్ సిద్ది పల్లి పుట్టినరోజు సందర్భంగా పాత్రికేయ మిత్రులతో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ మీట్ లో తాను మాట్లాడుతూ..

“నా పేరు క్రిష్ సిద్దిపల్లి నా చదువు అనంతరం సినిమా మీద,యాక్టింగ్ మీద ఉన్న ప్యాషన్ తో ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఇండస్ట్రీ కి వచ్చిన తర్వాత ఎటువంటి ఆఫర్స్ రాకపోవడంతో గత 8 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్లో వర్క్ చేశాను. డైరెక్టర్ వి. సముద్ర గారి దగ్గర మరియు రామ్ గోపాల్ వర్మ దగ్గర ఐస్క్రీమ్ మూవీకి దర్శకత్వ శాఖలో వర్క్ చేశాను. 2014లో అడవి శేష్ గారు చేసిన “క్షణం” మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను.

ఆ మూవీ నా లైఫ్ కు ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఆ సినిమా తర్వాత నా వర్క్ స్టైల్ నచ్చి నా కేదైనా వర్క్ ఇస్తే అది బాగా హ్యాండిల్ చేయగలుగు తాడని నమ్మి మళ్ళీ నాకు “గూఢచారి” సినిమాకు ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ గా అవకాశం ఇచ్చారు. అలా నా కెరీర్ ముందుకు వెళ్తున్న నాకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో కూడా కొన్ని సినిమాలకి ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ చేశాను.ఆ తరువాత అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ లో “టైగర్ నాగేశ్వరరావు” సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశాను.

అసిస్టెంట్ డైరెక్టర్ గానూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేయడం హ్యాపీ గా ఉన్నా కూడా యాక్టింగ్ మీద ఉన్న ప్యాషన్ మాత్రం అలాగే ఉండేది. చివరకు యాక్టింగ్ లో నా తొలి ప్రయత్నంగా “2021 అక్టోబర్ లో నేనొక ప్రాజెక్ట్ చేశాను అదే “నేను లేని నా ప్రేమకథ” ఇందులో నవీన్ చంద్ర నేను మెయిన్ లీడ్స్ గా చేయడం జరిగింది. ఈ సినిమా థియేటర్స్ లలో కూడా రిలీజ్ అయింది.ఈ సినిమా నాకు ఇండస్ట్రీలో మంచి పేరు తీసుకువచ్చింది.తరువాత కోవిడ్ కారణంగా ఇండస్ట్రీ లో అప్ & డౌన్ వచ్చి కొంత ఇబ్బంది పడినా మళ్ళీ ఇప్పుడు మంచి ప్రాజెక్టు లతో డిఫరెంట్, డిఫరెంట్ రోల్స్ తో చేస్తున్నాను.

సుఖీభవ అనే ప్రాజెక్ట్స్ లో ఒక విలేజ్ బాయ్ రోల్ గా ప్లే చేశాను. సెకండ్ ప్రాజెక్ట్ లో రమ్య, రాబర్ట్, రహీం సినిమాలో బ్లయిండ్ క్యారెక్టర్ చేస్తున్నాను.ఆ తరువాత ఎంగేజ్మెంట్ అనే మూవీ నాలుగు లాంగ్వేజ్ లో జరుగుతుంది. ఇది డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇది ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాల ద్వారా ప్రేక్షకులను కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తాను. అలాగే ఈ మూడు సినిమాల గురించి నా బర్త్ డే రోజున మీడియాతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది.

ఇవి కాకుండా “లవ్ ఇన్ 65″ లో వి. యన్ ఆదిత్య గారి డైరెక్షన్ లో యంగ్ రాజేంద్ర ప్రసాద్ గారి రోల్ చేశాను. ఆహాకీ లావణ్య త్రిపాటి గారి ఫ్రెండ్ రోల్ చేస్తున్నాను ఇలా మెయిన్ లీడ్ రోల్స్ లో చేయడమే కాకుండా వచ్చిన అవకాశం మిస్ చేసుకోకుండా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ లలో కూడా నటిస్తున్నాను. ఇవి కాకుండా ఇంకా కొన్ని ప్రాజెక్టులు డిస్కషన్ లో ఉన్నాయి ఎలాగైనా ఈ సంవత్సరం మంచి ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులు, మీడియా ఆశీర్వాదములతో మంచి నేమ్ అండ్ ఫెమ్ పొందాలని కోరుకుంటున్నాను.” అని తెలియజేసాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు