‘మెగాస్టార్’ పక్కన ఛాన్స్ దక్కించుకున్న ‘రెజినా’

regina-amitabh
‘ఎస్ఎంఎస్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటి ‘రెజినా’ పెద్దగా స్టార్ హీరోల పక్కన నటించకపోయినప్పటికీ తెలుగు, తమిళ భాషల్లో తక్కువ కాలంలోనే ఎక్కువ చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. ప్రస్తుతం ‘శ్రీనివాస అవసరాల’ చిత్రం ‘జో అచ్యుతానంద’ లో నటిస్తున్న ఈమె బాలీవుడ్ మెగాస్టార్ ‘అమితాబ్ బచ్చన్’ పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

2002లో విడుదలై మంచి విజయం సాధించిన బాలీవుడ్ థ్రిల్లర్ చిత్రం ‘ఆంఖేన్’ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘ఆంఖేన్ 2’ లో రెజినా అమితాబ్ తో కలిసి నటిస్తోంది. బ్యాంక్ దోపిడీ నైపథ్యంలో తెరకెక్కిన ఆంఖేన్ మొదటి భాగంలో ‘అర్జున్ రామ్ పాల్, అక్షయ్ కుమార్, సుస్మితా సేన్’ లు నటించగా ఈ సీక్వెల్ లో అక్షయ్ కుమార్ పాత్రలో ‘జాన్ అబ్రహం’ నటించనున్నాడు.