నాగచైతన్య తో రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన యువ నటి

నాగచైతన్య తో రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన యువ నటి

Published on Jan 31, 2023 1:30 AM IST

ప్రస్తుతం యువ నటుడు నాగ చైతన్య ఒక్కో సినిమాతో మంచి సక్సెస్ లని అలానే ఆడియన్స్, ఫ్యాన్స్ యొక్క ప్రేమాభిమానాలని చూరగొంటూ దూసుకెళ్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఆయన చేస్తున్న కస్టడీ మూవీ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది. దానితో పాటు మరొక రెండు ప్రాజక్ట్ లని కూడా నాగ చైతన్య లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. అయితే విషయం ఏమిటంటే, ఇటీవల సమంత నుండి విడిపోయిన నాగచైతన్య ప్రస్తుతం ఫ్యామిలితో కలిసి లైఫ్ ని లీడ్ చేస్తున్నారు.

అయితే యువ నటి దివ్యాంశ కౌశిక్ తో నాగచైతన్య డేటింగ్ చేస్తున్నారని ఇటీవల కొద్దిరోజులుగా కొన్ని మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి. కాగా వాటిపై నేడు ఒక మీడియా ఇంటర్వ్యూ లో భాగంగా నటి దివ్యాంశ కౌశిక్ స్పందించారు. నిజానికి నటుడు నాగచైతన్యతో కలిసి వర్క్ చేసిన మజిలీ మూవీ ఎక్స్ పీరియన్స్ ఎప్పటికీ మర్చిపోలేనని, అలానే ఆయన తనకు మంచి స్నేహితుడని అన్నారు. అంతేతప్ప మా ఇద్దరి మధ్య ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా ఎటువంటి డేటింగ్ వంటి రిలేషన్ లేదని, దయచేసి తప్పుడు కథనాలు ప్రచారం చేయవద్దని ఆమె అన్నారు. దానితో వారిద్దరూ కలిసి డేటింగ్ చేస్తున్నారు అనే కల్పిత వార్తలకు ఒక్కసారిగా అడ్డుకట్ట పడింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు