ఎన్టీఆర్ సినిమాలో యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ !

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రగా తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ పార్ట్స్, ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆ రోజుల్లో ఎన్టీఆర్ సరసన పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఓ మాజీ ప్రముఖ హీరోయిన్ పాత్రలో.. ఓ యంగ్ హీరోయిన్ నటించబోతుంది. వివరాల్లోకి వెళ్తే.. అలనాటి అందాల తార కృష్ణ కుమారి పాత్రలో.. యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ మాళవిక నాయర్ నటించనుంది. మాళవిక నాయర్ కి ఇప్పటికే మంచి నటి, మంచి పేరు కూడా తెచ్చుకుంది.

ఇక అప్పట్లో ఎన్టీఆర్ సరసన కృష్ణ కుమారి చాలా చిత్రాల్లో కలిసి నటించారు. అందులో చాలా చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ చిత్రాలకు సంబంధించిన షూటింగ్ సంఘటనలను ఈ బయోపిక్ లో చూపించనున్నారు. త్వరలో జరగబోయే షెడ్యూల్ లోనే మాళవిక నాయర్ మరియు బాలయ్య పై చిత్రబృందం ఆ సన్నివేశాల తాలూకు సీన్స్ ను చిత్రీకరించనున్నారు.

కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. కాగా జనవరి 9న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version