‘వెబ్ సిరీస్‌’ల వైపు మరో హీరోయిన్ ?

hansika motwani

తెలుగు సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందనుకున్న ‘హన్సికా మోట్వాని’ అందం అభినయం ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. అయితే హన్సికా మోట్వాని మాత్రం స్టార్ డమ్ ను పక్కన పెట్టి అవకాశాలు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ మధ్య హన్సికా మోట్వాని గ్లామర్ స్టిల్స్ బాగా వదులుతుంది. ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో కూడా అడుగుపెట్టబోతుంది.

భాగమతి దర్శకుడు జి. అశోక్ దర్శకత్వంలో రానున్న వెబ్ సిరీస్‌లో ఈ గ్లామర్ బ్యూటీ ఒక క్యారెక్టర్ లో నటించనుంది. ఇంకా పేరు పెట్టని ఈ వెబ్-సిరీస్ త్వరలో ఓ ప్రముఖ ఓటిటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రదర్శించబడుతుంది. ఇక ఈ సిరీస్ ఈ సమాజంలో మహిళలు రోజూ ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఎలివేట్ చేస్తూ సాగుతుందట.

Exit mobile version