డబ్బులు తీసుకోకుండా ఆ సాంగ్ చేశానంటున్న హీరోయిన్


రాశి ఖన్నా వరుసగా క్రేజీ ఆఫర్ లని అందుకుంటోంది. రాశి ఖన్నా నటించిన జై లవకుశ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోన్న విషయం తెలిసిందే. కాగా రాశిఖన్నా రవితేజ చిత్రం రాజా ది గ్రేట్ లో స్పెషల్ సాంగ్ లో మెరవబోతోంది. ఈ సాంగ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. జై లవకుశ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న రాశి ఖన్నా ఆ సాంగ్ గురించి ఆసక్తి కరమైన విషయం వెల్లడించింది.

స్పెషల్ సాంగ్ కోసం తాను ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని చెబుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు మంచి స్నేహితుడని అతడి కోసమే ఆ సాంగ్ చేశానని చెబుతోంది. ఈ సాంగ్ రాజా ది గ్రేట్ చిత్రంలో హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది.