క్రేజీ బజ్ : SSMB28 లో సెకండ్ హీరోయిన్ గా ఆ యంగ్ బ్యూటీ కన్ఫర్మ్ ?

Published on Nov 26, 2022 10:59 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా హారికా హాసిని క్రియేషన్స్ వారు SSMB28 వర్కింగ్ టైటిల్ తో ఒక భారీ ప్రతిష్టాత్మక మూవీని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. సూర్యదేవర రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ ని జరుపుకుంది. అతి త్వరలో సెకండ్ షెడ్యూల్ జరుపుకోనున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఒక క్రేజీ న్యూస్ టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఇటీవల రోషన్ హీరోగా వచ్చిన పెళ్లిసందడి మూవీ ఫేమ్ శ్రీలీల ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఎంపికయ్యారని, అలానే ఒక స్టార్ హీరోయిన్ ఇందులో ఒక ఐటెం సాంగ్ చేస్తున్నారు అని అంటున్నారు. కాగా దీని పై మూవీ టీమ్ నుండి అధికారికంగా న్యూస్ మాత్రం వెల్లడికావాల్సి ఉంది. అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని కూడా పక్కాగా మెప్పించేలా మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు త్రివిక్రమ్ దీనిని తెరకెక్కిస్తున్నారట. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న ఈ మూవీ రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :