
వైజయంతీ మూవీస్ పతాకంపై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ భారి చిత్రాన్ని నిర్మించడానికి సి.అశ్వనీదత్ రంగం సిద్దం చేశారు. మహేష్ బాబుతో ‘పోకిరి’, ‘బిజినెస్ మాన్’ వంటి హిట్ చిత్రాలను తీసిన దర్శకుడు పూరి జగన్నాధ్, ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. జూన్ 1న ఈ చిత్ర ముహూర్త ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని ప్రొడక్షన్ యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఈ చిత్రానికి ప్రముఖ రచయిత వక్కంతం వంశి అద్భుతమైన కథ సిద్దం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. మహేష్ సరసన ఇద్దరు అందాల భామలు నటించే ఈ చిత్రానికి ‘విశ్వరూపం’, ‘రన్ రాజా రన్’ ఫేం జిబ్రాన్ సంగీతం అందిస్తారు. ఏప్రిల్ నెలలో పాటల రికార్డింగ్ ప్రారంభించనున్నారు. మహేష్, పూరి జగన్నాథ్ కలయికలో రూపుదిద్దుకోనున్న మూడోవ చిత్రమిది. అలాగే, వైజయంతీ మూవీస్ సంస్థలో మహేష్ నటించే మూడవ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంతో హట్రిక్ ఖాయమని అభిమానులు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.