రాజ్ తరుణ్ “స్టాండ్ అప్ రాహుల్” లో యంగ్ డైరెక్టర్

Published on Feb 18, 2022 10:04 pm IST

యంగ్ హీరో రాజ్ తరుణ్, స్టాండ్ అప్ రాహుల్ అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు. నూతన దర్శకుడు సంతో మోహన్ వీరంకి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తుంది. ఈరోజు, C/o కంచరపాలెం సినిమా దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమాలో అతిధి పాత్రలో నటిస్తున్నట్లు తెలియజేసేందుకు మేకర్స్ వీడియో ప్రోమోను విడుదల చేసారు.

ప్రోమోలో అతన్ని స్టాండప్ కమెడియన్‌గా చూపించారు. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ ద్వారా బ్యాంక్రోల్ చేయబడిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ, దేవి ప్రసాద్ మరియు మధురిమ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :