నాగ శౌర్య, నారా రోహిత్, సందీప్ కిషన్ మల్టీ స్టారర్ !
Published on Nov 1, 2016 8:48 am IST

nagashourya-nara-sunddep
తెలుగు పరిశ్రమలో మల్టీ స్టారర్ సినిమాలకు ఈ మధ్య ఆదరణ బాగా పెరిగింది. బలమైన కథా కథనాలతో తెరకెక్కటే మల్టీ స్టారర్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవల విడుదలైన శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్లో రూపుదిద్దుకున్న నాగ శౌర్య, నారా రోహిత్ మల్టీస్టారర్ చిత్రం ‘జ్యోఅచ్యుతానంద’ ఆ కోవలోదే. ఈ ఫార్ములానే ఒడిసిపట్టుకుని మరో యంగ్ డైరెక్టర్ మల్టీ స్టారర్ చిత్రానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

‘భలే మంచిరోజు’ ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు యంగ్ హీరోలతో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడు. ఆ హీరోల్లో ముగ్గురు నాగ శౌర్య, నారా రోహిత్, సందీప్ కిషన్ లు కాగా మరో ఇద్దరు హీరోలు కూడా ఉన్నారట. ఈ కథ కొత్తగా ఉండి, ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చే విధంగా ఉంటుందని, కథను విన్న వెంటనే హీరోలంతా ఓకే చెప్పేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఫైనల్ డిస్కషన్స్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై హీరోల్ నుండి గాని, డైరెక్టర్ నుండి గాని ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు

 
Like us on Facebook