రవితేజ రీమేక్ సినిమాకు తెలుగు వెర్షన్ రాస్తున్న యువ దర్శకుడు!


ప్రస్తుతం ‘రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు’ వంటి సినిమాల్ని చేస్తున్న మాస్ మహారాజ రవితేజ త్వరలో తమిళ చిత్రం ‘భోగన్’ ను తెలుగులోకి రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వర్షన్ ను డైరెక్ట్ చేసిన లక్ష్మణ్ ఈ తెలుగు రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టు స్క్రిప్ట్ లో మార్పులు చేసే భాద్యతను యువ దర్శకుడు పవన్ సాదినేనికి అప్పగించారట.

పవన్ సాదినేని గతంలో ‘సావిత్రి, ప్రేమ ఇష్క్, కాదల్’ వంటి సినిమాల్ని డైరెక్ట్ చేశారు. దసరా తర్వాత మొదలుకానున్న ఈ చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్ గా క్యాథరిన్ థ్రెస నటించనుండగా తమిళంలో అరవిందస్వామి చేసిన పాత్రని హిందీ నటుడు రోనిత్ రాయ్ చేయనున్నాడు. దసరా తర్వాత సినిమా మొదలవుతుందని సమాచారం.