సినిమా మీద నమ్మకంగా ఉన్న యంగ్ హీరో !


‘తూనీగా తూనీగా’ సినిమాతో హీరోగా పరిచయమైన యంగ్ హీరో సుమంత్ అశ్విన్ ‘ చక్కిలిగింత, కేరింత’ వంటి సినిమాలతో పర్వాలేదనిపించింది ఆ తర్వాత చేసిన ‘కొలంబస్, రైట్ రైట్’ వంటి చిత్రాలు భారీ ఫ్లాపులుగా నిలవడంతో కెరీర్ పరంగా కాస్త వెనుకబడ్డారు. దీంతో ఈసారి చేయబోయే సినిమాతో ఉద్దేశ్యంతో గ్యాప్ తీసుకుని సీనియర్ దర్శకుడు డైరెక్షన్లో అలనాటి క్లాసికల్ హిట్ ‘లేడీస్ టైలర్’ కు సీక్వెల్ గా ‘ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్’ ను చేశారు.

ఈ సినిమా రేపు జూన్ 2 తారీఖున రిలీజ్ కానుంది. ఈ సినిమా తనకు తప్పకుండా మంచి విజయాన్నిస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు సుమంత్. డైరెక్టర్ వంశీతో వర్క్ చేయడం చాలా బాగుందని, మొదట లేడీస్ టైలర్ కు సీక్వెల్ చేయనని వంశీ అన్నారని కానీ స్క్రిప్ట్ కుదరడంతో చేశారని, సినిమా సెకండాఫ్ చాలా బాగుంటుందని, మణిశర్మ అందించిన సంగీతం చిత్రానికి బాగా హెల్ప్ అవుతుందని కూడా అన్నారు.