ఆర్డర్ చేయని ఆ పార్శిల్ తో అయోమయంలో పడ్డ యంగ్ హీరో !

20th, December 2016 - 06:30:02 PM

sundeep
మనం ఆర్డర్ చేయకుండానే మనకు ఈ కామర్స్ వెబ్ సైట్ నుండి పార్శిల్ వస్తే.. అది కూడా ఏదైనా వింత వస్తువు వస్తే షాకింగానే ఉంటుంది. అలాంటి షాకింగ్ సందర్బమే యంగ్ హీరో సందీప్ కిషన్ కు ఎదురైంది. ఆర్డర్ చేయని ఐటం వచ్చి ఆయన్ను ఆశ్చర్యంతో పాటు షాకింగ్ కు గురిచేసింది. విషయంలోకి వెళితే ఈరోజు ఉదయం హీరో సందీప్ కిషన్ ఇంటి నుండి బయటకెళ్ళగానే ఆయనకో ఫోన్ వచ్చిందట. అది అమెజాన్ డెలివరీ బాయ్ చేసిన కాల్. నెను మీ ఇంటి బయట ఉన్నాను. మీకో పార్శిల్ వచ్చింది అని అతను చెప్పగానే సందీప్ కిషన్ ఆశ్చర్యంగా ఇంటికి వెళ్లి పార్సిల్ తీసుకున్నాడట.

తీరా ఆ పార్శిల్ ను ఓపెన్ చేయగానే ఒక చిన్నపాటి లాగుతో పాటు క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు కొత్త సంవత్సరానికి ఆశీస్సులు. ఇట్లు సీక్రెట్ శాంటా అని మెసేజ్ కూడా ఉంది. అది చూసిన సందీప్ కిషన్ ‘ఈ వింత అనుభవానికి నవ్వాలో, భయపడాలి తెలియడంలేదు. ఇది నా ఫ్రెండ్స్ కూడా చేయలేదు. ఎందుకంటే నన్ను ఆటపట్టించడం కోసం నా అడ్రెస్, ఫోన్ నంబర్ డెలివరీ బాయ్ కి ఇవ్వరు కదా’ అంటూ ట్విట్టర్ ద్వారా తన అనుభవాన్ని పంచుకున్నాడు.