వాయిదా పడిన సిద్దార్థ సినిమా !

2nd, November 2017 - 12:05:06 PM

సిద్ధార్థ్‌ చాలా గ్యాప్ తరువాత తెలుగు ‘గృహం’ సినిమా విడుదల చెయ్యబోతున్నాడు. తమిళ్ లో ఈ హీరో నటించిన సినిమా తెలుగులో కూడా విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో ఆండ్రియా హీరోయిన్ గా నటించింది, మిలింద్‌ రావ్‌ దర్శకత్వం వహించారు. వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌, ఎటాకి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్ పై నిర్మిత‌మైన‌ ఈ సినిమాను ముందుగా నవంబర్ 3న విడుదల చేస్తునట్లు ప్రకటించారు. కాని ఇక్కడ థియేటర్స్ దొరక్కపోవడంతో సినిమా విడుదల అవ్వడం లేదు.

ఈ వారం ‘గరుడవేగా, ఏంజల్, నెక్స్ట్ నువ్వే’ అనే మూడు సినిమాలు విడుదలకాబోతున్నాయి. మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ ఉంది. ఒకే రోజు మూడు సినిమాలు రాబోతున్న సందర్భంలో థియేటర్స్ కొరత కొంతవరుకు ఉంటుంది. అందుకే సినిమా ఓపెనింగ్స్ తక్కువవుతాయని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సినిమా కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు నిర్మాతలు. అయితే తమిళ్ లో మాత్రం ఈ సినిమా రేపే విడుదల కాబోతుంది.