‘2 స్టేట్స్’ రీమేక్ లో యంగ్ హీరో !

రచయితా చేతన్ భగత్ రాసిన ‘2 స్టేట్స్’ బుక్ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘2 స్టేట్స్’ కు తెలుగు రీమేక్ రూపొందించాలనే ప్రయత్నాలు ఎన్నాళ్లగానో జరుగుతున్నాయి. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. వి.వి. వినాయక్ వద్ద అసోసియేట్ గా పనిచేసిన వెంకట్ రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు.

ముందుగా ఈ చిత్రంలో నాగ చైతన్య హీరోగా చేస్తారని వార్తలు రాగా ఇప్పుడు యంగ్ హీరో అడివి శేష్ కథానాయకుడిగా కుదిరినట్టు తెలుస్తోంది. అంతేగాక ఇందులో డెబ్యూట్ హీరోయిన్ ను తీసుకోవాలనే యోచనలో ఉన్నారు టీమ్. ఎం.ఎల్.వి.సత్య నారాయణ నిర్మించనున్న ఈ చిత్రం ఫిబ్రవరి లేదా మార్చి నెలలో మొదలయ్యే అవకాశాలున్నాయి.