తన డైలాగ్ తోనే కిరణ్ అబ్బవరం కొత్త ప్రాజెక్ట్ షురూ.!

Published on Feb 23, 2022 11:21 am IST


ప్రస్తుతం మన టాలీవుడ్ లో షైన్ అవుతున్న యంగ్ అండ్ టాలెంటడ్ హీరోస్ లో లేటెస్ట్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం కూడా ఒకడు. బ్యాక్ టు బ్యాక్ మంచి హిట్స్ అందుకుంటూ వెళ్తున్న ఈ యంగ్ హీరో మరిన్ని ఆసక్తికర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఓ సినిమా రిలీజ్ కి రెడీగా రెడీగా ఉండగా కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

ఇక ఇప్పుడు అయితే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తన నుంచో అనౌన్స్ అయ్యింది. దర్శకుడు కార్తీక్ శంకర్ తో అనౌన్స్ అయ్యిన ఈ సినిమాకి తన లాస్ట్ సినిమా “ఎస్ ఆర్ కల్యాణమండపం” లో హిట్ డైలాగ్ నేను “మీకు బాగా కావాల్సిన వాడిని” అనే టైటిల్ ని ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. మరి ఇందులో పక్కా మాస్ లుక్ లో కిరణ్ కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమాని కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మాణం వహిస్తుండగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :