పూజా కార్యక్రమంతో స్టార్ట్ అయ్యిన లక్ష్ చదలవాడ “ధీర” చిత్రం.!

పూజా కార్యక్రమంతో స్టార్ట్ అయ్యిన లక్ష్ చదలవాడ “ధీర” చిత్రం.!

Published on Apr 9, 2022 5:00 PM IST

టాలీవుడ్ కి పరిచయం అయ్యిన లేటెస్ట్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో లక్ష్. వరుస సినిమాలకు కమిటవుతూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు యంగ్ హీరో లక్ష్ చదలవాడ. ‘వలయం’ సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్న ఆయన.. త్వరలోనే ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే మరో ప్రాజెక్టు ఓకే చేసి ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చాడు.

“ధీర” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నేడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. తొలి సన్నివేశానికి ఖ్యాతి చదలవాడ క్లాప్ ఇవ్వగా.. చదలవాడ శ్రీనివాస రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ నెల 14వ తేదీ వరకు హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరగనుంది.

విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సరికొత్త కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 12గా ఈ సినిమా నిర్మిస్తున్నారు. పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ సినిమాకు బాణీలు కడుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ హంగులతో ఈ సినిమా నిర్మాణం పూర్తి చేయనున్నారట మేకర్స్.

ఇక ఈ సినిమాకి సాంకేతిక నిపుణులు – సమర్పణ : చదలవాడ బ్రదర్స్, బ్యానర్ : శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్, నిర్మాత : పద్మావతి చదలవాడ, దర్శకుడు : విక్రాంత్ శ్రీనివాస్, సంగీతం: సాయి కార్తీక్, సినిమాటోగ్రఫీ : కన్నా పీసీ, డైలాగ్స్: విక్రాంత్ శ్రీనివాస్, శృతిక్, ఎడిటర్: మధు రెడ్డి, ఫైట్ మాస్టర్ : జాషువా, పీఆర్వో : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు లు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు