‘రాధేశ్యామ్‌’ ప్రీరిలీజ్ వేడుకను హోస్ట్ చేయబోతున్న యంగ్ హీరో?

Published on Dec 22, 2021 10:00 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకున్న ఈ పాన్ ఇండియన్ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే రేపు ప్రీ రిలీజ్ వేడుకను రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించబోతుంది. అంతేకాదు ఈ సినిమా ట్రైలర్‌ను కూడా ఈ వేడుకలోనే విడుదల చేయనున్నారు.

అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుక్ను యువహీరో నవీన్‌ పొలిశెట్టి హోస్ట్ చేయబోతున్నాడని సమాచారం. నవీన్‌ పొలిశెట్టి నటించిన ‘జాతిరత్నాలు’ సినిమా ట్రైలర్‌ను ప్రభాస్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఆ సినిమా మంచి హిట్‌ కొట్టింది. అయితే ప్రభాస్‌పై ఉన్న కృతజ్ఞతా భావంతో ఇప్పుడు ‘రాధే శ్యామ్‌’ ప్రీ రిలీజ్‌ వేడుకకు నవీన్‌ పొలిశెట్టి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి అభిమానులే అతిథులని, వారి చేతుల మీదుగానే సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.

సంబంధిత సమాచారం :