కొత్త పద్దతిలో యువహీరో సినిమా నిర్మాణం !
Published on Nov 1, 2017 12:00 pm IST

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ‘పల్లకిలో పెళ్లికూతురు’ ‘బసంతి’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాలు పెద్దగా విజయవంతం అవ్వకపోయినా నటుడిగా గౌతమ్ మంచి పేరు సంపాదించుకున్నాడు. తాజాగా గౌతమ్ ‘మను’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మధురం, బ్యాక్ స్పేస్ వంటి లఘు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఫణింద్ర ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు.

ఈ సినిమా నిర్మాణం గమ్మత్తుగా జరిగింది. సినిమా నిర్మిస్తున్నామని, అందుకోసం ఫండ్ కావాలని పేస్ బుక్ లో ఈ చిత్ర యూనిట్ ప్రకటన చేశారు, ఇంట్రెస్ట్ ఉన్నవారు డబ్బు ఇవ్వడంతో దాదాపు 1 కోటి 20 లక్షలు జమా అయ్యాయి, ఆ డబ్బుతో సినిమా నిర్మాణం స్టార్ట్ చేశారు. డబ్బును చాలా జాగ్రత్తగా వాడుకొని సినిమా పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో గౌతమ్ విజయం అందుకుంటాడని ఆశిద్దాం.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook