నిఖిల్ డెడికేషన్..ఏకకాలంలో నాలుగు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్!

Published on Oct 26, 2021 11:00 am IST

తన సినిమాలకంటూ మన టాలీవుడ్ ఆడియెన్స్ లో స్పెషల్ బెంచ్ మార్క్ ను సెట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. స్వామి రారా తర్వాత నుంచి తన సినిమా వస్తుంది అంటే డెఫినెట్ గా ఒక కొత్త ప్రయోగం అనే మార్క్ టాలీవుడ్ లో ఉంది. అలా ఇప్పటి వరకు అస్కతికర సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ వస్తున్న నిఖిల్ తన కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి నాలుగు సినిమాలకు వర్క్ చేస్తున్నట్టుగా చెపుతున్నాడు.

గతంలో ఒక సినిమా ఒకే టైం లో చేశాను కానీ ఈసారి మాత్రం ఒకేసారి నాలుగు సినిమాలకు వర్క్ చేస్తుండడం తన నలుగురు పిల్లలులో దేన్నీ మొదటగా ఎంచుకోవాలో అన్నట్టుగా ఉందని చెప్తున్నాడు. అలాగే ఈ నాలుగు సినిమాలకు కూడా తన బెస్ట్ ఇస్తున్నానని థియేటర్స్ లో ఈ సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నట్టుగా తెలిపాడు. దీనిని నిఖిల్ తన సినిమాలు పట్ల ఎంత డెడికేటివ్ గా ఉన్నాడో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి ఇవన్నీ నిఖిల్ ఎప్పటికి కంప్లీట్ చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More