వైరల్ వీడియో : మెగాస్టార్ సాంగ్ ని ఎంజాయ్ చేస్తోన్న నిఖిల్

వైరల్ వీడియో : మెగాస్టార్ సాంగ్ ని ఎంజాయ్ చేస్తోన్న నిఖిల్

Published on Dec 22, 2022 12:30 AM IST


టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి నేటి ఎందరో నూతన నటీనటులకు ఆదర్శం అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. తొలి సినిమా పునాదిరాళ్ళు మొదలుకొని మొన్నటి గాడ్ ఫాదర్ వరకు చూసుకుంటే వాటిలో అనేక సినిమాలు రెఫరెండం అని చెప్తుంటారు పలువురు సినీ విశ్లేషకులు. ఇక ఈ వయసులో కూడా పలువురు యువ నటులకు గట్టి పోటీ ఇచ్చేలా వరుసగా సినిమాలు ఎంచుకుంటూ దూసుకెళ్తున్నారు మెగాస్టార్.

ఇక ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఆయన చేస్తున్న వాల్తేరు వీరయ్య మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13 న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకోగా ముఖ్యంగా ఊర్వశి రౌటేలా తో కలిసి మెగాస్టార్ స్టెప్పులేసిన బాస్ పార్టీ సాంగ్ అయితే మాస్ ఆడియన్స్ ని మరింతగా అలరించిందని చెప్పాలి. అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ 18 పేజెస్ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఊర్లలో టూర్స్ చేస్తున్న నిఖిల్ సిద్దార్థ, తన అభిమాన మెగాస్టార్ బాస్ పార్టీ సాంగ్ ని ఎంజాయ్ చేస్తున్న మూమెంట్ ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. కాగా ప్రస్తుతం ఆ వీడియో మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మొత్తంగా బాస్ పార్టీ తో మెగాస్టార్ మేనియా అన్నిచోట్లా మారుమ్రోగుతోందని ఈ వీడియోతో అర్ధం అవుతోందంటూ దానికి పలువురు మెగా ఫ్యాన్స్ ఆనందంతో కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు