తన సినిమాల రిలీజ్ పట్ల కాస్త వర్రీలో యంగ్ హీరో.!

తన సినిమాల రిలీజ్ పట్ల కాస్త వర్రీలో యంగ్ హీరో.!

Published on Jan 27, 2022 8:00 AM IST


మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో తన సినిమాలకు అంటూ ఒక ప్రత్యేక మార్క్ ని సెట్ చేసుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్. తన సినిమా వస్తుంది అంటే మినిమమ్ గ్యారెంటీ ఒక కొత్త థ్రిల్లింగ్ సబ్జెక్ట్ తో వస్తున్నాడనే నమ్మకం ఆడియెన్స్ లో అయితే తాను అందుకోగలిగాడు.

మరి ఇప్పుడు ఈ యంగ్ హీరో తన సినిమా విడుదల పట్ల కాస్త వర్రీ అవుతున్నాడు. తన లాస్ట్ హిట్ సినిమా “అర్జున్ సురవరం” తర్వాత నాలుగు సినిమాలు ఓకే చేశాను. ఆ నాలుగు కూడా బ్రిలియెంట్ సబ్జెక్టులే..కానీ ఈ ప్యాండమిక్ మూలాన అందరి కెరీర్ లు నాశనం అవుతున్నాయి.

ఇది చాలా బాధాకర విషయం అని అలాగే తన సినిమాలు అన్నింటిపై కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని కానీ వాటి రిలీజ్ లే అర్ధం కానీ పరిస్థితిలో మారాయని అంటున్నాడు. దేవుడి దయ వల్ల ఈ సమస్యలు అన్ని క్లియర్ అయ్యి మా సినిమాలు త్వరలోనే విడుదల కావాలని అనుకుంటున్నానని తెలిపాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు