ఆహాలో స్ట్రీమింగ్‌లోకి వచ్చేసిన “ది అమెరికన్ డ్రీమ్‌”..!

Published on Jan 14, 2022 2:28 am IST

యంగ్ హీరో ప్రిన్స్‌ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ చిత్రం ‘ది అమెరికన్‌ డ్రీమ్‌’. డా. విఘ్నేష్ కౌశిక్ దర్శకత్వంలో డాక్టర్ ప్రదీప్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. అమెరికాలో జాబ్ చేసి అక్కడ సెటిల్ అవ్వాలని అనుకున్న ఓ తెలుగు కుర్రాడికి అమెరికాలో ఎదురయ్యే కష్టాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారు.

అయితే ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో స్ట్రీమింగ్‌లోకి వచ్చ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రిన్స్ సరసన నేహా కృష్ణ హీరోయిన్‌గా నటించగా, రవితేజా ముక్కావలి, శుభలేఖ సుధాకర్, శ్రీ మిరాజ్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అభినయ్ తిమ్మరాజు సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :