తన రూటే సెపరేటని నిరూపించుకున్న యువహీరో!

16th, October 2016 - 09:55:57 AM

Ekadiki-potave-china-m
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎంతమంది యువహీరోలు ఉన్నారో చెప్పక్కర్లేదు. వీరంతా ఎవరికి వారే తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటే తప్ప నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లోనే స్వామిరారా సినిమా నుంచి తన ప్రతి సినిమాకూ ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటూ వస్తోన్న యువహీరో నిఖిల్, తాజాగా తన కొత్త సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ను కూడా కొత్తగా ప్లాన్ చేసిన విషయం టీజర్ చూస్తే స్పష్టమైపోయింది. నిన్న సాయంత్రం విడుదలైన ఈ టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

చనిపోయిన తర్వాత మనిషి బరువు 21 గ్రాములు తగ్గుతుందని, ఆ 21 గ్రాములే ఆత్మ అని చెబుతూ, ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ టీజర్ ఒక్కసారే సినిమాపై విపరీతమైన ఆసక్తి కలిగించిందనే చెప్పాలి. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్, వచ్చే నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరన్న ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ సినిమా, ఓ డిఫరెంట్ లవ్‍స్టోరీగా ప్రచారం పొందుతోంది. ఈ ట్రైలర్‌తో నిఖిల్ తన రూట్ సెపరేటని, ఇలాంటి కొత్త సినిమాలతోనే ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నానని మరోసారి నిరూపించేశారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి