ప్రేక్షకుల హృదయంలో నిలుస్తానంటున్న యువ హీరో

Dochey
ఒకలైలా కోసం అందించిన విజయానందంలో నాగచైతన్య తన తదుపరి సినిమాతో మనల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాడు. స్వామి రారా దర్శకుడు సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కృతి సనన్ హీరోయిన్.

ఈ సినిమా గురించి చైతూ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులకు మా సినిమా సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని తెలిపాడు. కధలో ఎంటర్టైన్మెంట్ కి కొదవలేదని తెలిపాడు. ముఖ్యంగా ఛేజింగ్ సన్నివేశాలు హాలీవుడ్ స్టైల్ లో వుంటాయని తెలిపాడు. కృతి సనన్ మంచి కో స్టార్ అని కితాబిచ్చాడు.

సన్నీ అందించిన సంగీతం అందరినీ ఆకట్టుకుంటుంది.బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకానుంది

Exit mobile version