బయోపిక్ కోసం కసరత్తులు చేస్తున్న హీరో !
Published on Jul 10, 2017 1:00 pm IST


ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా ఒక సినిమా తీరికెక్కనున్న సంగతి విధితమే. ఈ బయోపిక్లో హీరో సుధీర్ బాబు గోపీచంద్ పాత్రను పోషించనున్నారు. స్వతహాగా క్రీడాకారుడైన సుధీర్ బాబు గోపీచంద్ పాత్రలో నటించేందుకు గట్టి హోమ్ వర్క్ చేస్తున్నారట. ఇప్పటికే పాత్ర కోసం 3 కిలోల బరువు తగ్గిన ఆయన ఇంకో 5 కిలోలు తగ్గాలని అంటున్నారు.

అంతేకాకుండా ఈ సినిమా కోసమా విదేశాలకు చెందిన ప్రొస్థెటిక్ మేకప్ నిపుణులు పనిచేయనున్నారట. గోపీచంద్ ను అత్యంత దగ్గర నుండి గమనించడం, ఆయనతో కలిసి పనిచేయడం, ఆయనతో ఉన్న అనుభవం వలన ఆ పాత్రకు సరైన న్యాయం చేయగలనని అనుకుంటున్నానని, సెప్టెంబర్ నుండి సినిమా మొదలవుతుందని అన్నారు. ఇకపోతే ప్రస్తుతం ఆయన నటించిన మల్టీ స్టారర్ చిత్రం ‘శమంతకమణి’ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ కానుంది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook