పవన్ సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో చెప్పిన యంగ్ హీరో !
Published on Jun 18, 2017 3:48 pm IST


యంగ్ హీరో ఆది పినిశెట్టి నటించిన తాజా చిత్రం ‘మరకతమణి’ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. హీరోగా మాత్రమే కాకూండా గతంలో అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ చిత్రంలో విలన్ పాత్ర చేసి మంచి పేరు తెచ్చుకున్న ఆది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో కూడా అలాంటి పాత్రే చేస్తున్నాడు.

తాజాగా జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆది తనకు విభిన్నమైన రోల్స్ చేయడమంటే ఇష్టమని అందుకనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తున్నానని అన్నారు. అంతేగాని రెగ్యులర్ విలన్ రోల్స్ తాను చేయనని, గతంలో ‘సరైనోడు’ సినిమాలో చేసిన వైరం ధనుష్ పాత్ర ఒక ఐడియాలజీతో నడుస్తుందని, అందుకే చేశానని అన్నారు. అలాగే కళ్యాణ్ గారి సినిమాలో కూడా తనది అలాంటి పాత్రేనని, తన క్యారెక్టర్ ఒక ఐడియాలజీ ఉంటుందని, దాని కోసం హీరోతో ఫైట్ చేస్తానని అన్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ చిత్రం సారధి స్టూడియోస్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

 
Like us on Facebook