నితిన్ దర్శకుడితో రాజ్ తరుణ్ ?


తాజాగా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రంతో ఇటీవలే మంచి విజయం అందుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై, హెబ్బే పటేల్ జంటగా ‘అందగాడు’ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో మరొక చిత్రం చేస్తూనే ఇంకో కొత్త ప్రాజెక్ట్ కు సిద్దమైపోయాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నితిన్ హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించిన విజయకుమార్ కొండా డైరెక్ట్ చేయనున్నాడట.

ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని కూడా తెలుస్తోంది. ఇప్పటికేప్రే ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలుపెట్టుకున్న ఈ చిత్రం పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి రాజ్ తరుణ్, విజయ్ కుమార్ ల నుండి ఇంకా పూర్తి స్థాయి సమాచారం బయటకు రాలేదు.