పెద్ద హీరో కోసం పాట పాడిన చిన్న హీరో !

26th, June 2017 - 12:04:08 PM


ఈ మధ్య హీరోలు తన సినిమాల్లో తామే పాటలు పాడుకోవడం సర్వ సాధారణమైపోయింది. కానీ ఒక హీరో మరొక హీరో కోసం పాడటం మాత్రం కొంచెం అరుదైన విషయమే. గతంలో ఎన్టీఆర్ కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కోసం పాడినట్టు ఇప్పుడు తమిళ హీరో జీవి.ప్రకాష్ కుమార్ స్టార్ హీరో ఇలయదళపతి విజయ్ కోసం గొంతు సవరించారు.

స్వతహాగా కంపోజర్, సింగర్ అయిన ప్రకాష్ కుమార్ హీరోగా బాగా బిజీ అయ్యాక పాడటం కొంచెం తగ్గించారు. కానీ తన అంకుల్ ఏ.ఆర్ రెహమాన్ కోసం, తన అభిమాన హీరో విజయ్ కోసం ‘మెర్సల్’ సినిమాలో ఒక ఎనర్జిటిక్ మాస్ పాటను ఆలపించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇలా విజయ్, రెహమాన్, ప్రకాష్ కుమార్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన ఆ పాట ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి తమిళ ప్రేక్షకుల్లో ఎక్కువైంది. ప్రకాష్ కుమార్ గతంలో విజయ్ చేసిన ‘తేరి’ సినిమాకు సంగీతం అందించిన సంగతి తెలిసిందే.