‘మిస్టర్’ సినిమాలో కీ రోల్ పోషించనున్న యంగ్ హీరో !

prince
మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా చేస్తున్న చిత్రం ‘మిస్టర్’. దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాతో తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని భావిసున్నారు. తాజాగా స్పెయిన్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం కొద్ది రోజుల క్రితమే కర్ణాటకలోని చిక్ మంగుళూరులో కొత్త షెడ్యూల్ ప్రారంభించింది. ఇకపోతే ఈ చిత్రంలో యంగ్ హీరో ప్రిన్స్ ఓ కీలక పాత్ర పోషించున్నట్లు తెలుస్తోంది.

‘బస్ స్టాప్, రొమాన్స్, మరల తెలుపనా ప్రియా’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన ప్రిన్స్ ఈ మధ్య విడుదలైన రామ్ చిత్రం ‘నేను శైలజా’ లో కూడా కీలక పాత్రలో నటించాడు. ఈ విషయంపై యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మందులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.