నిర్మాతగా మూవీస్ చేయడానికి ఇష్టపడుతున్న చైతూ!!

naga-chaitanya1
‘జోష్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ‘ఏమాయ చేసావే’ సినిమా తో యువతను విపరీతంగా మెప్పించిన హీరో అక్కినేని నాగ చైతన్య. ఈ అక్కినేని హీరో 28వ పుట్టిన రోజు ఈ రోజు. ఈ సంద్రభంగా నాగ చైతన్య తనకి నటుడిగానే కాకుండా మంచి సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించి నిర్మాణ రంగంలోనూ తన సత్తా చాటుకోవాలని అనుకుంటున్నాడు. ‘నాకు మొదటి నుంచీ నిర్మాత అవ్వాలని ఉంది. అందులో భాగంగానే హోం ప్రొడక్షన్ లో వచ్చిన ఒక లైలా కోసం సినిమాకి నేనే నిర్మాణ బాధ్యతలు చూసుకున్నాను. ముందు ముందు నిర్మాతగా ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తీయాలని ఉందని’ బర్త్ డే రోజున చైతన్య తెలిపాడు.

నాగ చైతన్య నుంచి రానున్న తదుపరి సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని జనవరిలో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఒక వారం రోజులు గ్యాప్ తీసుకుంటున్న నాగ చైతన్య నవంబర్ 30న తన తదుపరి సినిమాని లాంచ్ చేసి డిసెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమమ్ కి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి చందూ మొండేటి డైరెక్టర్. 2016 సమ్మర్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తారు.

Exit mobile version