శుభవార్త చెబుతానంటున్న యంగ్ హీరో!

Published on Oct 13, 2016 3:52 pm IST


హ్యాట్రిక్ హిట్స్‌తో వచ్చిన జోరును ‘శంకరాభరణం’తో అందుకోలేకపోయిన నిఖిల్, తాజాగా కొత్త సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ తనకు కలిసొచ్చిన ప్రయోగాలనే ఎంపికచేసుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు వీఐ ఆనంద్‌తో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అన్న సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఆయన, తాజాగా మరో కొత్త సినిమాను కూడా అప్పుడే సెట్స్‌పైకి తీసుకెళ్ళి శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ‘స్వామిరారా’తో నిఖిల్‌ కెరీర్‌కు సూపర్ బూస్ట్ ఇచ్చి దర్శకుడిగా పరిచయమైన సుధీర్ వర్మ నిఖిల్ కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు.

“స్వామిరారా దర్శకుడు సుధీర్ వర్మతో షూటింగ్ చేస్తూ ఉండడం ఒక సంతోషకరమైన విషయం అయితే, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’కు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త కూడా ప్రకటించే అవకాశం రావడం మరింత సంతోషకరమైన విషయం. ఆ సంతోషకరమైన వార్తను త్వరలోనే ప్రకటిస్తా” అంటూ నిఖిల్ తెలిపారు. నవంబర్ 11న విడుదల కానున్న ఈ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’కు సంబంధించి నిఖిల్ చెప్పబోయే ఆ శుభవార్త సినిమా బిజినెస్ విషయమై ఉంటుందని వినిపిస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More